కూటమి విజయం ,పవన్ కళ్యాణ్ పిఠాపురం గెలుపు కోరుకుంటూ చేసుకున్న మొక్కును తీర్చుకునేందుకు ఒక మెగా అభిమాని పాదయాత్ర చేపట్టారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మందపల్లికి చెందిన మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని నక్క వెంకటేశ్వరరావు, తన గ్రామం నుండి పిఠాపురం వరకు పాదయాత్రగా బయలుదేరారు.పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి భారీ మెజారిటీతో విజయం సాధించాలని ఎన్నికల సమయంలో వెంకటేశ్వరరావు మొక్కుకున్నారు.

ఆ మొక్కు మేరకు ఇప్పుడు పాదయాత్ర చేపట్టి, పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. తన మొక్కులో భాగంగా పిఠాపురంలో వంద మందికి అన్నదానం చేయనున్నారు.గతంలో వెంకటేశ్వరరావు తన కుమారుడికి చిరంజీవి పేరు పెట్టాలని కోరగా, మెగాస్టార్ స్వయంగా పిలిపించుకుని ఆ కోరిక తీర్చారు. నాటి నుండి మెగా కుటుంబం పట్ల తనకున్న భక్తిని ఆయన ఈ విధంగా చాటుకుంటున్నారు.
