జమ్మికుంట మున్సిపాలిటీలను బీజేపీకి అప్పగిస్తే ఈ ప్రాంతాలను మోడల్ పట్టణాలుగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. జమ్మికుంట డిగ్రీ కాలేజీలో రూ.6.5 కోట్లతో నిర్మించనున్న సింథటిక్ స్టేడియం స్థలాన్ని ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు.

BJP ప్రభుత్వం మంజూరు చేసిన రూ.6.5 కోట్లతో త్వరలోనే స్టేడియం పనులు ప్రారంభిస్తాం. కాలేజీ స్థలాల కబ్జాలపై ఉక్కుపాదం మోపుతాం. జమ్మికుంట రైల్వే స్టేషన్‌ను ‘అమృత్’ పథకం కింద ఎయిర్ పోర్ట్ తరహాలో అభివృద్ధి చేస్తాం. నాయిని చెరువును బోటింగ్, పార్కులతో అద్భుతమైన పర్యాటక కేంద్రంగా మారుస్తాం.

కిరాయి ఇళ్లలో ఉండేవారు మరణిస్తే ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రత్యేక భవన సముదాయాన్ని నిర్మిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేవని, మున్సిపాలిటీల అభివృద్ధి కేవలం కేంద్ర నిధులతోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.అనంతరం పార్టీ నాయకులతో కలిసి మాట్లాడిన ఆయన,BJP అధికారంలో లేకపోయినా నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నానని తెలిపారు.
