AP :కృష్ణా తీరం భవాని ఐల్యాండ్లో ‘ఆవకాయ్ అమరావతి’ ఫెస్టివల్

January 8, 2026 12:25 PM

కృష్ణా నది తీరం పర్యాటక శోభతో మెరిసిపోతోంది. జనవరి 8 నుండి 10 వరకు విజయవాడలోని పున్నమిఘాట్, భవాని ఐల్యాండ్ వేదికలుగా ‘ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్’ నిర్వహించనున్నారు. ఈ వేడుకల ఏర్పాట్లను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, APTDC M.D ఆమ్రపాలి, కలెక్టర్ లక్ష్మీ శ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేలా రూపొందించిన హౌస్ బోట్స్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపుప్రారంభించనున్నారు. త్వరలోనే గోదావరి తీరంలోనూ వీటిని ప్రవేశపెడతామని మంత్రి తెలిపారు.

ఈ ఫెస్టివల్‌లో DYCM పవన్ కళ్యాణ్ పాల్గొంటారని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. తెలుగు సంస్కృతి, కళలు, సాహిత్యం మరియు సినిమా వైభవాన్ని ప్రపంచానికి చాటేలా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో సంగీత విభావరి, సాహిత్య చర్చలు, కవితా పఠనాలు, నాటకాలు మరియు ఫుడ్ ఫెస్టివల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

సినిమా, సాహిత్య రంగాలకు చెందిన దిగ్గజాలు, ప్రపంచవ్యాప్త కళాకారులు ఈ వేడుకల్లో పాలుపంచుకోనున్నారు. రాష్ట్ర సంస్కృతిని కాపాడుతూనే పర్యాటక రంగాన్ని ఆర్థిక వృద్ధి పథంలో నడిపించాలన్న CM, డిప్యూటీ CMల దూరదృష్టికి ఈ ఫెస్టివల్ నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media