తన రాజకీయ ఎదుగుదలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అంతర్జాతీయ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో మెస్సీతో కలిసి ఫుట్‌బాల్ ఆడిన జ్ఞాపకాలను సీఎం గుర్తు చేసుకున్నారు.
“నేను ముఖ్యమంత్రిని అయ్యాను కాబట్టే Messi అంతటి వాడు వచ్చి నాతో కలిసి ఫుట్‌బాల్ ఆడాడు. అదే సాధారణ వ్యక్తిగా ఉంటే నన్ను ఎవరు గుర్తుపడతారు? కనీసం మ్యాచ్ చూడటానికి ఒక పాస్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు” అంటూ CM Revanth వ్యాఖ్యానించారు. పదవి వల్ల దక్కిన ఈ గౌరవాన్ని రాష్ట్ర గౌరవంగా భావిస్తున్నానని, తెలంగాణను క్రీడల హబ్‌గా మార్చడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. మెస్సీ పర్యటన సమయంలో CM Revanth స్వయంగా ఫీల్డ్‌లోకి దిగి గోల్ కొట్టిన వీడియోలు అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆయన చేసిన ఈ వినమ్రమైన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
