సంక్రాంతి పండుగ వేళ గోదావరి జిల్లాల్లో పందెం కోళ్ల సందడి మామూలుగా ఉండదు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలంలోని ఓ కోళ్లఫారంలో ఉన్న ‘కొక్కిరాయి’ రకం కోడిపుంజు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దీనికి ఏకంగా రూ. 3.50 లక్షల ధర పలికినా యజమాని అమ్మనని చెప్పడం విశేషం.

ఇది పందెం కోళ్లలో అత్యంత డిమాండ్ ఉన్న ‘కొక్కిరాయి’ రకానికి చెందిన పుంజు. సుమారు 5 కిలోల బరువున్న ఈ పుంజు వయస్సు 3 ఏళ్ల 4 నెలలు. సంక్రాంతి పందాల నేపథ్యంలో దీనికి భారీ క్రేజ్ ఏర్పడింది. ఇటీవల ఒక పందెం రాయుడు దీనిని రూ. 3.50 లక్షలకు కొనుగోలు చేస్తానని ముందుకొచ్చినా, యజమాని దీనిపై ఉన్న మక్కువతో విక్రయించడానికి నిరాకరించారు. సాధారణంగా పందెం కోళ్లు వేలల్లో పలుకుతాయి, కానీ లక్షల ధర పలకడం ఈ పుంజు ప్రత్యేకతను చాటుతోంది.
