ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యంత భీకరమైన నక్సలైట్ దాడుల్లో ఒకటిగా నిలిచిన కరకగూడెం పోలీస్ స్టేషన్ మారణకాండ జరిగి నేటికి సరిగ్గా 29 ఏళ్లు. 1997 జనవరి 9న అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన నాటి సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.1997 జనవరి 9న అర్ధరాత్రి సమయంలో భారీ సంఖ్యలో మావోయిస్టులు (నాటి పీపుల్స్ వార్) ఒక్కసారిగా కరకగూడెం పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టారు. స్టేషన్ భవనాన్ని మందుపాతరలతో పేల్చివేసి, విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 16 మంది పోలీసులు వీరమరణం పొందారు.అమాయక పోలీసులను పొట్టనబెట్టుకోవడమే కాకుండా, స్టేషన్‌లో ఉన్న భారీ ఎత్తున ఆయుధాలను మావోయిస్టులు ఎత్తుకెళ్లారు. అడవి బిడ్డల రక్షణ కోసం పనిచేసే పోలీసులపై జరిగిన ఈ దాడి, నాటి ఏపీ ప్రభుత్వ యంత్రాంగాన్ని కుదిపేసింది. నేటికి ఆ ప్రాంతంలో ఆ అమరవీరుల జ్ఞాపకాలు సజీవంగానే ఉన్నాయి.

