AP:ఇరుసుమండ Blowout ఘటన పై CM చంద్రబాబు సమీక్ష

January 9, 2026 4:44 PM

DR.B.R అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో సంభవించిన ఓఎన్‌జీసీ బ్లోఔట్ (Blowout) ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అంతకుముందు ఆయన ఏరియల్ వ్యూ ద్వారా ఘటనా స్థలాన్ని పరిశీలించి, మంటల ఉద్ధృతి మరియు నష్టాన్ని అంచనా వేశారు.

బ్లోఔట్‌ను అదుపు చేసేందుకు ఓఎన్‌జీసీ అధికారులు తీసుకుంటున్న చర్యలను సీఎం అడిగి తెలుసుకున్నారు. మంటలు పూర్తిగా ఆర్పేందుకు అవసరమైతే జాతీయ, అంతర్జాతీయ నిపుణుల సలహాలు తీసుకోవాలని సూచించారు. మంటల వల్ల దెబ్బతిన్న కొబ్బరి చెట్లు మరియు పంట పొలాలకు తక్షణమే నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని ఓఎన్‌జీసీ అధికారులను ఆదేశించారు.


బాధితులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని, పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి అన్ని వసతులు కల్పించాలని జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన భద్రతా నిబంధనలు పాటించాలని హెచ్చరించారు. ఈ సమీక్షలో అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి, ఓఎన్‌జీసీ ఉన్నతాధికారులు మరియు జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media