నియోజకవర్గాన్ని మౌలిక సదుపాయాల పరంగా ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లలో రూ. 1.50 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ చేశారు.

కొత్తూరులో రూ. 30 లక్షలతో అంతర్గత రోడ్ల పనులకు శ్రీకారం. జూలైవాడా, రెవెన్యూ కాలనీల్లో రూ. 1.20 కోట్లతో అంతర్గత రోడ్లు మరియు సైడ్ డ్రైనేజీ పనుల ప్రారంభం. గతంలో నిర్లక్ష్యానికి గురైన కాలనీలపై ప్రత్యేక దృష్టి సారించామని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా సైడ్ డ్రైనేజీ పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పనుల నాణ్యతలో రాజీ పడకూడదని, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములై పనుల పురోగతిని పర్యవేక్షించాలని కోరారు.
