విద్యార్థులకు మన హిందూ సంస్కృతి, సాంప్రదాయాల పట్ల అవగాహన కల్పించే లక్ష్యంతో భీమిలి బ్యాంక్ కాలనీ సమీపంలోని ద సన్ స్కూల్ (The Sun School) లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. స్కూల్ డైరెక్టర్ కైతుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
పాఠశాల ప్రాంగణమంతా పల్లెటూరిని తలపించేలా ముస్తాబు చేశారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగల ప్రాముఖ్యతను వివరించేలా ప్రదర్శనలు నిర్వహించారు. విద్యార్థులు హరిదాసులు, గంగిరెద్దుల వారు మరియు పల్లెటూరి వేషధారణలతో అలరించారు.
తెలుగు వారి ఆచార వ్యవహారాలు ప్రతిబింబించేలా నిర్వహించిన ఆటపాటలు, సంప్రదాయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆధునిక ప్రపంచంలో మన మూలాలను మర్చిపోకుండా, హిందూ సంస్కృతిని భావితరాలకు అందించడమే ఈ వేడుకల ప్రధాన ఉద్దేశమని డైరెక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు.
