TTD శ్రీవారి చెంత ‘Anaganaga OkaRaju’ టీమ్,శివ బాలాజీ

January 20, 2026 2:36 PM

కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని మంగళవారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాజకీయ రంగంతో పాటు సినీ రంగానికి చెందిన ప్రముఖులు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

యువ హీరో నవీన్ పొలిశెట్టి, హీరోయిన్ మీనాక్షి చౌదరి, దర్శకుడు మారి, రచయిత చిన్మయి స్వామివారిని దర్శించుకున్నారు. సినిమా ఘనవిజయం సాధించాలని వారు వేడుకున్నారు. సినీ నటుడు శివ బాలాజీ కూడా నేడు స్వామివారిని దర్శించుకున్న ప్రముఖుల్లో ఉన్నారు. ప్రముఖులకు టీటీడీ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా, అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media