AP:అనిల్ నీరుకొండ దంత వైద్య కళాశాల Graduation Day కు C.P

January 22, 2026 6:01 PM

స్థానిక అనిల్ నీరుకొండ దంత వైద్య కళాశాల 2022-26 బ్యాచ్ విద్యార్థుల స్నాతకోత్సవం (Graduation Ceremony) ఘనంగా జరిగింది. ఈ వేడుకకు విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పట్టాలు అందజేశారు. మొత్తం 90 మంది అండర్ గ్రాడ్యుయేట్ (BDS), 18 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ (MDS) విద్యార్థులు పట్టాలను అందుకున్నారు.

విద్యార్థులు వృత్తి నైపుణ్యాలతో పాటు భావవ్యక్తీకరణ నైపుణ్యాలను (Communication Skills) పెంపొందించుకోవాలని సీపీ సూచించారు. సివిల్ సర్వీసెస్ వైపు ఆసక్తి ఉన్న విద్యార్థుల కోసం కమిషనర్ తన వ్యక్తిగత ఫోన్ నంబర్ ఇచ్చి, సందేహాల నివృత్తికి సంప్రదించవచ్చని తెలపడం విశేషం. భవిష్యత్తులో ఏ స్థాయికి ఎదిగినా తల్లిదండ్రులను, దేశాన్ని మర్చిపోకూడదని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎల్. వంశీకృష్ణా రెడ్డి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల సీఈఓ డాక్టర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media