అపూర్వ సహోదరులు: ఉత్తమ పురస్కారాలు అందుకున్న ‘CI, SI’

January 28, 2026 10:56 AM

ఒకే కుటుంబం నుంచి ఇద్దరు అన్నదమ్ములు పోలీస్ శాఖలో ఉన్నత అధికారులుగా రాణించడమే కాకుండా, ఒకే వేదికపై ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. 2026 గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కృష్ణా జిల్లాలో ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. పామర్రు సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) వి. సుభాకర్, హనుమాన్ జంక్షన్ సబ్ ఇన్స్పెక్టర్ (SI) వి. సురేష్ ఇద్దరూ తమ విధుల్లో చూపిన ప్రతిభకు గాను జిల్లా స్థాయి ఉత్తమ సేవా పురస్కారాలకు ఎంపికయ్యారు. జిల్లా కలెక్టర్ బాలాజీ, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు చేతుల మీదుగా ఈ అన్నదమ్ములు ఇద్దరూ ఒకే సందర్భంలో అవార్డులు అందుకోవడం విశేషం.

పెద్దన్న సుభాకర్ 2009 బ్యాచ్ ఎస్సైగా ఎంపికై ప్రస్తుతం సీఐగా విధులు నిర్వహిస్తుండగా.. తమ్ముడు సురేష్ 2012 బ్యాచ్ ఎస్సైగా పోలీస్ శాఖలో కొనసాగుతున్నారు. వేర్వేరు హోదాల్లో ఉన్నా, ఒకే జిల్లాలో పనిచేస్తూ.. ఒకే రోజున అత్యున్నత పురస్కారాలు అందుకోవడం వీరి జీవితాల్లో మరపురాని మధుర జ్ఞాపకంగా నిలిచిపోయింది. ఈ అపూర్వ సహోదరులను తోటి అధికారులు మరియు ప్రజలు అభినందనలతో ముంచెత్తుతున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media