AP:వెలిగొండ ప్రాజెక్టుపై ‘నిమ్మల’ శ్వేతపత్రం: జూన్ 2026 నాటికి పూర్తి

January 29, 2026 12:02 PM

వెలిగొండ ప్రాజెక్టును రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ప్రజా ప్రయోజనాల కోసం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ప్రాజెక్టు పనుల ప్రస్తుత స్థితిగతులను సాక్ష్యాధారాలతో వివరించారు.

వెలిగొండ ద్వారా 43.58 టీఎంసీల కృష్ణా జలాలను తరలించి.. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 30 మండలాలకు సాగునీరు, 15.25 లక్షల మందికి తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం.
2024 మార్చిలో జగన్ అసంపూర్తి పనులతోనే ప్రాజెక్టును జాతికి అంకితం చేసి ప్రజలను దగా చేశారని మంత్రి విమర్శించారు. నిర్వాసితులకు కనీస న్యాయం చేయకుండా, పోలీసుల పహారాలో ప్రారంభోత్సవ డ్రామా ఆడారని మండిపడ్డారు. ఈ టన్నెల్ లైనింగ్ పనులను జూన్ 2026 నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం 3.6 కి.మీ మేర లైనింగ్ పనులు బాకీ ఉన్నాయని వెల్లడించారు.11,500 క్యూసెక్కుల నీటిని మళ్లించేందుకు రూ. 456 కోట్లతో లైనింగ్ మరియు సీసీ వాల్ పనులను ఈ నెలలోనే ప్రారంభిస్తున్నారు. 13 గ్రామాలకు రహదారిగా ఉండే 9.60 కి.మీ డైవర్షన్ రోడ్డు పనులు 85% పెండింగ్‌లో ఉండగా, కూటమి ప్రభుత్వం మట్టి రోడ్ పనులను వేగవంతం చేసింది. 7,225 నిర్వాసిత కుటుంబాలకు రూ. 886 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సి ఉందని, వైకాపా ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వీరికి పూర్తి న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media