కోటీశ్వరుడైన అటెండర్ రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ ACBదాడులు

January 29, 2026 4:29 PM

“దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి” అనే చందంగా అవినీతికి పాల్పడుతున్న అధికారులపై ఏసీబీ అధికారులు పంజా విసిరారు. తిరుపతి జిల్లా రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ తిరుమలేష్ మరియు ఆయనకు ‘మనీ కలెక్టర్’గా వ్యవహరిస్తున్న ఒక ప్రైవేట్ అటెండర్ నివాసాలపై ఏకకాలంలో దాడులు జరిపి అధికారులు విస్తుపోయే ఆస్తులను గుర్తించారు.

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక అటెండర్ స్థాయి వ్యక్తి కోట్లాది రూపాయల వసూళ్లకు పాల్పడుతున్నట్లు అధికారుల నిఘాలో తేలింది. నెల రోజులుగా నిఘా పెట్టిన ఏసీబీ, పక్కా ఆధారాలతో దాడులు నిర్వహించింది. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం, డి.సి. పల్లి గ్రామంలోని సబ్ రిజిస్ట్రార్ తిరుమలేష్ స్వగృహంతో పాటు, ఆయన బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, ఆయన నివాసం మరియు అటెండర్ నివాసాలపై అధికారులు ఏకకాలంలో దాడులు చేయడంతో రిజిస్ట్రేషన్ శాఖలో కలకలం రేగింది. ప్రాథమిక సోదాల్లో భారీగా నగదు, స్థిరాస్తి పత్రాలు మరియు బంగారం లభించినట్లు సమాచారం. లెక్కల్లో చూపని ఆస్తుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media