వైభవంగా ద్రాక్షారామ భీమేశ్వర కళ్యాణం:మంత్రి వాసంశెట్టి సుభాష్!

January 29, 2026 5:49 PM

అష్టాదశ శక్తిపీఠాలలో 12వ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి వార్ల దివ్య కళ్యాణ మహోత్సవం కనుల పండువగా జరిగింది. బుధవారం రాత్రి ప్రారంభమైన ఈ వేడుక ఆధ్యాత్మిక శోభతో అంగరంగ వైభవంగా సాగింది.రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి, కళ్యాణ వేడుకకు శ్రీకారం చుట్టారు.

క్షేత్ర ఆచారాల ప్రకారం.. శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ సమేత శ్రీ నారాయణ స్వామి, మరియు శ్రీ చండికా సమేత శ్రీ సూర్యేశ్వర స్వామి వార్ల దివ్య కళ్యాణ ఘట్టాలు వేదమంత్రోచ్ఛారణల మధ్య అత్యంత వైభవంగా జరిగాయి. ప్రముఖ వేద పండితులు దేవులపల్లి ఫణి రామకృష్ణ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా ఈ వివాహ క్రతువు నిర్వహించారు. వేలాది మంది భక్తులు ఈ దివ్య కళ్యాణాన్ని తిలకించి తరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు మరియు పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media