AP:Rushikonda ప్రాథమిక పాఠశాలలో ‘Spell Bee’ పోటీలు

January 30, 2026 5:33 PM

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థులలో ఆంగ్ల భాషా పరిజ్ఞానాన్ని, పదకోశాన్ని పెంపొందించే లక్ష్యంతో ప్రతి ప్రాథమిక పాఠశాలలో ‘స్పెల్బీ లీఫ్ వర్డ్’ (SpellBee Leaf Word) పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రిషికొండ గ్రామంలోని మండల ప్రాథమిక పాఠశాలలో 3, 4, 5 తరగతి విద్యార్థులకు ఈ పోటీలను శుక్రవారం అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన MEO-2 అనురాధ మాట్లాడుతూ.. ఇటువంటి పోటీలు విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని మరియు భాషా నైపుణ్యాన్ని పెంచుతాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిజెవైఎం (BJYM) రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓరుగంటి మాధవరావు, కిసాన్ మోర్చా జనరల్ సెక్రెటరీ కామేష్, భీమిలి నియోజకవర్గ కో-కన్వీనర్ వాసు తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.ఎండాడ మండల అధ్యక్షులు నాగరాజు, వైస్ ప్రెసిడెంట్ సుబ్బరాజు, చంద్రశేఖర్ రాజు, సోషల్ మీడియా కన్వీనర్ అంకమ్మరావు మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పదాల స్పెల్లింగ్స్ చెబుతూ తమ ప్రతిభను చాటారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media