NTR భరోసా వెల్ఫేర్ అసిస్టెంట్ల పింఛన్ల గోల్‌మాల్

January 30, 2026 6:31 PM

పేద ప్రజలకు ఆసరాగా నిలవాల్సిన ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల సొమ్ముకు ప్రభుత్వ ఉద్యోగులే కన్నం వేశారు. ప్రత్తిపాడు, ఏలేశ్వరం మండలాల్లో భారీ ఎత్తున పింఛన్ల నిధులు దుర్వినియోగమైనట్లు విచారణలో తేలింది. సుమారు రూ. 9,41,500 పింఛన్ల సొమ్మును నకిలీ పత్రాలతో కాజేసిన ఐదుగురు సిబ్బందిపై వేటు వేసేందుకు యంత్రాంగం సిద్ధమైంది.
జే.అన్నవరం పంచాయతీలో పనిచేసిన సమయంలో రూ. 2.14 లక్షలు దుర్వినియోగం చేశారు. ప్రస్తుతం ఈయన తొండంగిలో పనిచేస్తున్నారు. ఏలేశ్వరం మండలం యర్రవరంలో పనిచేస్తూ రూ. 4.67 లక్షలు గోల్‌మాల్ చేశారు. ప్రస్తుతం ఈయన పరారీలో ఉన్నట్లు సమాచారం. యర్రవరంలో పనిచేస్తూ రూ. 50,500 దుర్వినియోగం చేశారు. ప్రస్తుతం లింగంపర్తిలో పనిచేస్తున్నారు. వీరిద్దరూ కలిసి రూ. 2,06,500 నిధులు పక్కదారి పట్టించారు. ప్రస్తుతం లంపకలోవ, పెద్దిపాలెంలో పనిచేస్తున్నారు. నిధుల దుర్వినియోగంపై ఇన్చార్జ్ కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, వెంటనే రికవరీ చేయాలని ఆదేశించారు. సొమ్ము చెల్లించని పక్షంలో క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media