ఎర్రచందనం కింగ్ పిన్స్ వేట మొదలైంది: Dycm పవన్ కళ్యాణ్

February 2, 2026 11:27 AM

శేషాచలం అడవుల సంపదను దోచుకుంటున్న స్మగ్లర్లపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్, అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ మొహమ్మద్ ముజామిల్ ను శనివారం ఉదయం అరెస్ట్ చేసింది.చిత్తూరు – నాయుడుపేట జాతీయ రహదారిపై అడిషనల్ ఎస్పీ కులశేఖర్ నేతృత్వంలోని బృందం ముజామిల్‌ను పట్టుకుంది. ఇతడు చైనాలోని ‘జైమెన్ టాంగాంగ్ ఫాంగ్ ట్రేడ్ కంపెనీ’తో సంబంధాలు కలిగి ఉండి, లైసెన్స్ పేరుతో అక్రమంగా ఎర్రచందనాన్ని తరలించేవాడు.

“ఎర్రచందనం ముట్టుకోవాలంటే భయపడాలి” అన్న పవన్ కళ్యాణ్ గారి హెచ్చరికల నేపథ్యంలో ఈ ఆపరేషన్ సాగింది. 87 శాతం కేసుల్లో శిక్షలు పడినా తప్పించుకు తిరుగుతున్న ముజామిల్‌ను పట్టుకోవడం టాస్క్ ఫోర్స్ సాధించిన మొదటి విజయం. స్మగ్లింగ్ నిరోధక దళం పనితీరును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు. టాస్క్ ఫోర్స్ హెడ్ ఎస్పీ సుబ్బారాయడు, అడిషనల్ ఎస్పీ కులశేఖర్ బృందానికి ప్రత్యేక ప్రశంసలు దక్కాయి. కింగ్ పిన్స్ ఏ మూలన దాగి ఉన్నా వేటాడి పట్టుకుంటామని, అక్రమ రవాణాకు పాల్పడే వారి పట్ల ప్రభుత్వం నిర్ధయగా వ్యవహరిస్తుందని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media