ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు వైసీపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపడ్డారు. అధికారం కోల్పోయిన అసహనంతో అంబటి రాంబాబు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారని ఆయన విమర్శించారు.
ఓటమి తర్వాత అంబటి రాంబాబు మానసిక స్థితి తప్పిందని, వ్యక్తిగత దూషణలకు దిగడం ఆయన సంస్కృతికి అద్దం పడుతోందని మంత్రి విమర్శించారు. గతంలో పోలీసులపై అంబోతులా దూకడం ప్రజాస్వామ్య వ్యవస్థపై జరిగిన దాడి అని, వైసీపీ నేతలకు చట్టాలంటే గౌరవం లేదని ధ్వజమెత్తారు. బాధ్యతాయుతమైన పదవిలో పనిచేసిన వ్యక్తి బజారు భాషతో రాజకీయం చేయడం సిగ్గుచేటని, వైసీపీ నాయకత్వం ఇలాంటి వారిని ప్రోత్సహించడం వారి వైఫల్యమేనని అన్నారు. అడ్డగోలుగా చిందులు తొక్కుతూ, అబద్ధాలు ప్రచారం చేస్తే ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెబుతారని మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు.
