AP:లడ్డూల్లో వాడింది నెయ్యి కాదు.. కెమికల్స్ మంత్రి N.మనోహర్

February 2, 2026 3:44 PM

“తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడింది నెయ్యి కాదు.. కేవలం నెయ్యి వాసన వచ్చేలా కెమికల్స్‌తో తయారు చేసిన పదార్థం. దీనివల్ల కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి” అని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. శనివారం తెనాలిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన తిరుమల నెయ్యి కుంభకోణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో YSRCPఎక్కడా ‘క్లీన్ షీట్’ ఇవ్వలేదని, కేవలం శాంపిల్ సైజ్ చిన్నదిగా ఉండటం వల్ల కొన్ని సాంకేతిక అంశాలను నిర్ధారించలేకపోయారని మంత్రి స్పష్టం చేశారు.

గత నాలుగు ఏళ్లలో సుమారు 60 లక్షల లీటర్ల నకిలీ నెయ్యిని సరఫరా చేసి ₹233 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు. అసలు నెయ్యి అనే పదార్థమే లేకుండా, కేవలం వాసన కోసం కెమికల్స్ కలిపిన పదార్థాన్ని లడ్డూలు, మహాప్రసాదంలో వాడటం భక్తులను గాయపరచడమేనని అన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే, పండగలు చేసుకుంటూ రోడ్లపైకి రావడం వైఎస్ఆర్సీపీ నేతల దిగజారుడుతనానికి నిదర్శనమని, కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు పారదర్శకంగా సాగుతోందని మంత్రి తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media