రాష్ట్ర సమాచార కమిషనర్ P.S నాయుడుకు విశాఖలో ఘన స్వాగతం

February 2, 2026 4:38 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్‌గా ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించిన పి.ఎస్. నాయుడు శనివారం మొదటిసారి విశాఖపట్నం విచ్చేశారు. ఈ సందర్భంగా విశాఖ రైల్వే స్టేషన్‌లో ఆయనకు గ్రేటర్ విశాఖ వెలమ సంక్షేమ సంఘం (59/2012) ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.

P.S నాయుడును భారీ పూలమాలలు, దుశ్శాలువాలతో సంఘం సభ్యులు ఘనంగా సత్కరించారు. సమాచార కమిషనర్‌గా ఆయన మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వెలమ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు చలమూరి నాయుడు బాబు, అధ్యక్షులు సూరెడ్డి సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ దొగ్గ దుర్గాప్రసాద్, ప్రధాన కార్యదర్శి బాదిరెడ్డి రవిశంకర్ పాల్గొన్నారు. కోశాధికారి సిరిపురపు గౌరీ శంకర్, మెండ సింహాచలం నాయుడు, తురపాడ రామకృష్ణ తదితరులు పాల్గొని పి.ఎస్. నాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media