AP:BC గురుకులాల్లో ప్రవేశాలకు ఫిబ్రవరి 4thన నోటిఫికేషన్

February 3, 2026 11:44 AM

ఉమ్మడి కడప జిల్లాలోని మహాత్మ జ్యోతిబాపూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో (MJPAPBCWREIS) 5వ తరగతి, ఇంటర్మీడియట్ మరియు ఇతర తరగతుల్లో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా కన్వీనర్ కె.వి.ఎస్. రామకృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రవేశం లభించే పాఠశాలలు/కళాశాలలు:

బాలికలకు: నందలూరు, వనిపెంట, తొండూరు గురుకులాలు.

బాలురకు: కమలాపురం, జమ్మలమడుగు గురుకులాలు.

అర్హత: 5వ తరగతి, జూనియర్ ఇంటర్మీడియట్ మరియు 6, 7, 8 తరగతుల్లో ఖాళీగా ఉన్న (Backlog) సీట్లకు ప్రవేశం కల్పిస్తారు. 04-02-2026 నుండి 04-03-2026 వరకు.
అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా mjpapbcwreis.apcfss.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆయా పాఠశాలల పని దినాల్లో నేరుగా సంప్రదించవచ్చు లేదా నందలూరులోని ఉమ్మడి కడప జిల్లాల కన్వీనర్ కార్యాలయంలో సమాచారం పొందవచ్చు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media