కడప: జిల్లాలోని ప్రధాన మార్కెట్ యార్డుకు వచ్చే రైతులు, అక్కడ పనిచేసే హమాలీలు కనీస వసతులు లేక నానా అవస్థలు పడుతున్నారని సిఐటియు (CITU) నాయకత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు మార్కెట్ యార్డ్ సెక్రటరీ శ్రీధర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
సుమారు 300 మంది హమాలీ కార్మికులతో పాటు, పంటలు తెచ్చే రైతుల కోసం వెంటనే సురక్షిత మంచినీటి వసతి కల్పించాలి.గతంలో రోడ్డు విస్తరణ పేరుతో తొలగించిన మరుగుదొడ్లను ఇప్పటివరకు నిర్మించకపోవడంతో మహిళా కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే ఆధునిక మరుగుదొడ్లు నిర్మించాలి. గత నాలుగేళ్లుగా హమాలీలకు పెండింగ్‌లో ఉన్న యూనిఫాంలను వెంటనే పంపిణీ చేయాలి.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్, యార్డ్ కన్వీనర్ రవి, నగర అధ్యక్షులు చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతాంగానికి, కార్మికులకు మౌలిక వసతులు కల్పించడంలో అలసత్వం వహిస్తే పోరాటం ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.
