మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం, కార్యాలయంపై జరిగిన దాడులను మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వస్తున్న వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకోవడానికి పోలీసులు అక్రమ నోటీసులు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు.అంబటి రాంబాబును భౌతికంగా అంతం చేయాలనే కుట్రతోనే ఈ దాడులకు తెగబడ్డారని మోదుగుల ఆరోపించారు. ఆవేశంలో అన్న మాటకు అంబటి ఇప్పటికే క్షమాపణ చెప్పినా, ఇలా దాడులు చేయడం అనైతికమని అన్నారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని, దాడులు జరుగుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు.
ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని, కేవలం నారా లోకేష్ రూపొందించిన ‘రెడ్ బుక్’ రాజ్యాంగమే నడుస్తోందని మండిపడ్డారు. బాధితులను పరామర్శించేందుకు వస్తున్న వైసీపీ అధినేత జగన్ పర్యటనను అడ్డుకోవాలని చూడటం దుర్మార్గమని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాము వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.అన్ని అక్రమ కేసులకు, దాడులకు సమాధానం చెప్పే రోజు త్వరలోనే వస్తుందని ఆయన హెచ్చరించారు.
అంబటిపై దాడి రెడ్ బుక్ రాజ్యాంగం: మోదుగుల వేణుగోపాల్ రెడ్డి
