పేదలకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన మొబైల్ టీ క్యాంటీన్ ను ఆయన బుధవారం ప్రారంభించారు.
కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను 90% వరకు ఇప్పటికే నెరవేర్చిందని కన్నా పేర్కొన్నారు. గత ప్రభుత్వం (వైసీపీ) అమ్మఒడి పేరుతో మోసం చేసిందని, కానీ కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తోందని చెప్పారు.సత్తెనపల్లి పట్టణంలోని పార్కు అభివృద్ధి మరియు దానికి ఆనుకుని ఉన్న రోడ్డు నిర్మాణానికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రూ. 7.25 కోట్లు మంజూరు చేసినట్లు కన్నా వెల్లడించారు. నిత్యావసర ధరలు పెరిగినా, పేదవాడి ఆకలి తీర్చేందుకు ‘అన్న క్యాంటీన్’ ద్వారా రూ. 5 కే భోజనం అందిస్తున్నామని తెలిపారు.జగన్ హయాంలో పెన్షన్ల పెంపు పేరుతో జరిగిన మోసాన్ని ప్రజలు గమనించాలని, కూటమి ప్రభుత్వం నిరంతరం ప్రజాక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
