కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో అక్రమ రేషన్ బియ్యం దందాపై పౌర సరఫరాల శాఖ అధికారులు విరుచుకుపడ్డారు. సూరంపల్లి పారిశ్రామిక వాడ సమీపంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
పీడీఎస్ డీటీ (PDS DT) అంకాలు ఆధ్వర్యంలో అధికారులు సూరంపల్లి వద్ద సోదాలు నిర్వహించారు.ఒక గోడౌన్ నుండి లారీలోకి లోడ్ చేస్తున్న సుమారు 520 బస్తాల రేషన్ బియ్యాన్ని అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని ప్రభుత్వ సివిల్ సప్లై గోడౌన్‌కు తరలించి, బాధ్యులపై కేసులు నమోదు చేశారు. ఈ బియ్యం ఎక్కడి నుండి సేకరించారు? ఎక్కడికి తరలిస్తున్నారు? అనే కోణంలో అధికారులు లోతైన విచారణ జరుపుతున్నారు.
