ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం దేవస్థానం ఈవోగా ప్రస్తుతం కాకినాడ జిల్లా రెవెన్యూ అధికారి (DRO)గా విధులు నిర్వహిస్తున్న జె. వెంకటరావును ప్రభుత్వం నియమించింది. రెవెన్యూ శాఖ నుండి ఆయన సేవలను దేవదాయ శాఖకు బదిలీ చేస్తూ, ప్రాథమికంగా ఏడాది కాలానికి ఈ బాధ్యతలను అప్పగించారు.
కాకినాడ డీఆర్వో జె. వెంకటరావును సింహాచలం దేవస్థానానికి బదిలీ చేశారు. వెంకటరావు బదిలీతో ఖాళీ అయిన కాకినాడ జిల్లా రెవెన్యూ అధికారి పోస్టులో డి. తిప్పే నాయక్ ను నియమించారు. ఈయన ప్రస్తుతం అనంతపురం జిల్లా కేఆర్‌ఆర్‌సీ (KRRC)లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు.రెవెన్యూ శాఖలో సీనియర్ అధికారిగా ఉన్న వెంకటరావు నియామకంతో సింహాచలంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని భక్తులు ఆశిస్తున్నారు.
