AP:JANASENAకు బిగ్ షాక్ బొలిశెట్టి సత్యనారాయణ రాజీనామా!

February 5, 2026 11:42 AM

జనసేన పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తితో ఉన్న ఆయన, చివరకు జనసేనకు గుడ్ బై చెప్పారు.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నారు. పర్యావరణం, గాలి, నీరు కోసం తాను చేస్తున్న న్యాయ పోరాటాలపై పార్టీ రంగు పడకూడదని, తన పోరాటం స్వతంత్రంగా సాగాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.నామినేటెడ్ పదవుల భర్తీలో జనసేన కోసం కష్టపడిన నేతలకు అన్యాయం జరుగుతోందని బొలిశెట్టి గత కొంతకాలంగా బహిరంగంగానే తన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు, తాను నిర్వహిస్తున్న అన్ని బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.చాలా కాలంగా పవన్ కళ్యాణ్ వెన్నంటే ఉండి, వివిధ అంశాలపై గళం వినిపించిన బొలిశెట్టి వైదొలగడం జనసేన శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media