కడప జిల్లా కు చెందిన ఉమెన్ క్రికెటర్ శ్రీచరణి, మాజీ కెప్టెన్ మిథాలీ కలిశారు . భారత మహిళా క్రికెట్ జట్టులో చోటు దక్కించుకొని రాష్ట్రానికి గౌరవం తీసుకొచ్చింది. ఆమె ప్రదర్శనతో WPL వేలం మరియు జాతీయ స్థాయి మ్యాచ్‌లలో కీలక పాత్ర పోషించింది.తాజాగా, శ్రీచరణి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, మంత్రి నారా లోకేష్ గారిని కలిశారు . ఈ సందర్భంగా మాజీ భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా హాజరయ్యారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీచరణిని అభినందిస్తూ, భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమె ప్రతిభను ప్రశంసిస్తూ ప్రోత్సాహక చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ తెలిపారు.

