TG:గ్యాస్ ధరల పెంపుపై AAP వినూత్న నిరసన..

March 12, 2026 12:33 PM

Aam Aadmi Party నాయకులు వంట గ్యాస్ సిలిండర్ ధరల పెంపును నిరసిస్తూ Tank Bund వద్ద వినూత్నంగా ఆందోళన చేపట్టారు. B. R. Ambedkar విగ్రహం సమీపంలో ఖాళీ గ్యాస్ సిలిండర్‌ను ఉంచి కట్టెల పొయ్యిపై వంట చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆప్ నాయకులు మాట్లాడుతూ గ్యాస్ ధరలను పెంచి కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం మోపిందని విమర్శించారు. పెరిగిన ధరల వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.తదుపరి ప్రధాని Narendra Modi దిష్టిబొమ్మకు చీర కట్టి గాజులు తొడిగిస్తూ నిరసన తెలిపారు. వెంటనే వంట గ్యాస్ ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media