కడప కార్పొరేషన్ కార్యాలయంలో ACB ఆకస్మిక దాడులు

March 11, 2026 10:03 AM

Kadapa నగర కార్పొరేషన్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. Andhra Pradesh Anti-Corruption Bureau (ఏసీబీ) అధికారులు టౌన్ ప్లానింగ్ విభాగంలో ఈ తనిఖీలు చేపట్టారు.

టౌన్ ప్లానింగ్ విభాగంలోని కొందరు అధికారులపై అక్రమాలు, లంచాల ఆరోపణలు రావడంతో ఈ దాడులు నిర్వహించినట్లు సమాచారం. ఏసీబీ సీఐ నాగరాజు ఆధ్వర్యంలో అధికారులు రికార్డులు, ఫైళ్లను పరిశీలిస్తున్నారు.సోదాల సమయంలో కార్యాలయంలోకి ఎవరినీ అనుమతించకుండా గదుల తలుపులు మూసివేసి తనిఖీలు కొనసాగించారు. అనుమానాస్పద పత్రాలు, లావాదేవీలపై అధికారులు విచారణ చేస్తున్నారు. రికార్డుల పరిశీలన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media