ఇలాంటి కథలు ఎలా పుట్టుకొస్తాయో తెలియట్లేదు: శ్రీలీల తల్లి

May 18, 2026 10:13 AM

నటి శ్రీలీల, క్రికెటర్ తిలక్ వర్మల మధ్య రిలేషన్ షిప్ ఉందని ఆన్‌లైన్‌లో వదంతులు వ్యాపించడంతో, ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. అయితే, వారిద్దరి మధ్య సంబంధం ఉందనే ఊహాగానాల్లో ఏమాత్రం నిజం లేదని, ఆ వాదనలు నిరాధారమైనవని స్పష్టం చేశారు శ్రీలీల తల్లి. “తిలక్ వర్మ, శ్రీలీలల చుట్టూ ఉన్న వదంతులు పూర్తిగా నిరాధారమైనవి మరియు అవాస్తవమైనవి. వారిద్దరూ ఎప్పుడూ కలుసుకోలేదు, మాట్లాడుకోలేదు కూడా.” అని క్లారిటీ ఇచ్చారు.

శ్రీలీల తల్లి స్వర్ణలత శ్రీలీల పెళ్లికి ఇంకా సమయం ఉందని చెప్పారు. సోషల్‌ మీడియాలో వస్తోన్న వార్తలు పూర్తిగా అవాస్తవం, నిరాధారం. ఇలాంటి కథలు ఎలా పుట్టుకొస్తాయో తెలియట్లేదు. ఈ వార్తలలో అణువంత కూడా నిజం లేదన్నారు. శ్రీలీల ప్రస్తుతం తన చదువు, యాక్టింగ్‌లో బిజీగా ఉంది. ఏ మాత్రం విరామం దొరికినా నీట్‌-పీజీ ఎగ్జామ్‌కు ప్రిపేర్‌ అవుతోందన్నారు. ఇలాంటి వ్యక్తిగత విషయాల గురించి ఆలోచించడానికి ఆమెకు మరో ఐదారు సంవత్సరాల సమయం ఉందని తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media