అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

April 16, 2026 4:34 PM

అద్దంకి మండలం చక్రాయపాలెం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

నరసరావుపేట నుంచి మేదరమెట్ల వైపు వెళ్తున్న కారు, ఎదురుగా వస్తున్న రెండు బైకులను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనలో అద్దంకికి చెందిన కొటికలపూడి శీను, గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామానికి చెందిన సర్పరాజు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.తీవ్రంగా గాయపడిన వ్యక్తిని 108 అంబులెన్స్ ద్వారా ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను అద్దంకి మార్చురీకి తరలించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media