గుంటూరులో అడ్వకేట్ పై కర్రలతో దాడి.. హాస్పిటల్ లో బాధితుడు!

March 3, 2026 12:37 PM

గుంటూరు నగరంలో సోమవారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. గొర్రెల మండి ప్రాంతంలో అడ్వకేట్ శ్రీ కామిశెట్టి చెన్నకేశవులుపై పలువురు వ్యక్తులు కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటన న్యాయవాద వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.

P.భాగ్యరావు అనే వ్యక్తి తరపున న్యాయవాదిగా వ్యవహరిస్తున్నందున, ప్రత్యర్థులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. లింగాపురం బార్ అండ్ రెస్టారెంట్ యజమాని చిరుమామిళ్ల అశోక్, చల్లా రమేష్, యామిని కోటేశ్వరరావు, బండ్ల వెంకట నరసయ్య తదితరులు కలిసి న్యాయవాదిని అడ్డగించి కర్రలతో కొట్టినట్లు బాధితుడు ఆరోపించారు. తీవ్రంగా గాయపడిన చెన్నకేశవులు ప్రస్తుతం గుంటూరు జనరల్ హాస్పిటల్ (GGH)లో చికిత్స పొందుతున్నారు. న్యాయవాదులపై దాడులు పెరిగిపోవడం పట్ల న్యాయవాద సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దోషులను తక్షణమే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.”న్యాయవాదులపై దాడి అంటే న్యాయవ్యవస్థపై దాడి చేసినట్టే” అని పేర్కొంటూ అడ్వకేట్స్ సమాజం ఐక్యంగా నిరసనలకు సిద్ధమవుతోంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media