జైలు నుంచి కోర్టు వరకూ… పెరరివాళన్ జీవితం

April 28, 2026 5:33 PM

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దాదాపు 30 సంవత్సరాలు జైలు జీవితం గడిపిన ఆయన, ఇప్పుడు అడ్వకేట్‌గా కొత్త ప్రయాణం ప్రారంభించబోతున్నారు.

Supreme Court of India ఆదేశాలతో 2022లో విడుదలైన తర్వాత, సమయాన్ని వృథా చేయకుండా 3 సంవత్సరాల LLB కోర్సు పూర్తి చేశారు. అనంతరం Bar Council of Tamil Nadu and Puducherryలో అధికారికంగా అడ్వకేట్‌గా నమోదు కావడం ఆయన జీవితంలో కీలక ఘట్టంగా మారింది.ఇప్పుడు Madras High Courtలో ప్రాక్టీస్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఒకప్పుడు నిందితుడిగా కోర్టుకు హాజరైన వ్యక్తి, ఇప్పుడు అదే న్యాయ వ్యవస్థలో న్యాయవాదిగా వాదనలు వినిపించబోతుండటం విశేషంగా మారింది.1991లో రాజీవ్ గాంధీ హత్య కేసులో పెరరివాళన్‌కు విధించిన ఉరిశిక్ష తరువాత జీవిత ఖైదుగా మారింది. శిక్ష పూర్తయినా విడుదల ప్రక్రియ ఆలస్యమవడంతో, చివరకు సుప్రీంకోర్టు జోక్యంతో ఆయన విడుదలయ్యారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media