రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డిపై టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ysrcp నాయకులు దేవుడి సొమ్మును కూడా వదలకుండా దోచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.
జడ్పీ మరియు ప్రభుత్వ నిధులను ఆకేపాటి తన సొంత ఎస్టేట్ పనులకు వాడుకున్నారని జగన్ మోహన్ రాజు ఆరోపించారు. ఆకేపాడులోని 56/1 సర్వే నెంబర్ గల 5.1 ఎకరాల భూమిలో టీటీడీ నిధులతో కల్యాణ మండపం నిర్మించి, దానిని ఎమ్మెల్యే తన భార్య పేరుకు మార్చుకోలేదా? అని ప్రశ్నించారు. ఏడుకొండల వాడి నిధులతో కట్టిన మండపం ఇప్పటికీ ఎమ్మెల్యే ఎస్టేట్ ఆవరణలోనే ఎందుకు ఉందని, అది ప్రజలకు ఎలా ఉపయోగపడుతుందని నిలదీశారు. సదరు భూమి వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరిచారా? అని ప్రశ్నిస్తూ.. ఎమ్మెల్యే అక్రమాలపై త్వరలోనే న్యాయపోరాటం చేస్తామని జగన్ మోహన్ రాజు హెచ్చరించారు.
