అఖిల్ ‘లెనిన్’ విడుదల వాయిదా.. కొత్త తేదీ ఇదే!!

June 13, 2026 8:01 PM
akkineni akhil lenin movie

అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘లెనిన్’ విడుదల వాయిదా పడింది. అయితే ఈ సినిమాను జూలై 10న విడుదల చేయనున్నట్లు అక్కినేని నాగార్జున వెల్లడించారు. ఈ వాయిదాకు గల కారణాన్ని నాగార్జున వివరించారు. “లెనిన్ చిత్రబృందం నన్ను కలిసి, సినిమాను మరింత ప్రత్యేకంగా, 100 శాతం అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు మరికొంత సమయం కావాలని కోరారు. వారిలోని అభిరుచి, స్ఫూర్తి చూసి నేను అంగీకరించాను” అని ఆయన స్పష్టం చేశారు. “మనోడు జూలై 10న వస్తున్నాడు. నేను మళ్ళీ చెబుతున్నా, మీరు ఒక కొత్త అఖిల్‌ను చూస్తారు! ‘లెనిన్’ అనుభవానికి సిద్ధంగా ఉండండి” అంటూ చెప్పడం విశేషం.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media