అమలాపురంలో పోలీసుల మెరుపు దాడులు 5 క్రాకర్స్ షాపులు సీజ్

March 3, 2026 6:03 PM

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఫైర్ క్రాకర్స్ తయారీ కేంద్రాలు, షాపులపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఇటీవల వేట్లపాలెంలో జరిగిన అగ్నిప్రమాద ఘటన నేపథ్యంలో అమలాపురం డి.ఎస్.పి ప్రసాద్ నేతృత్వంలో ఈ తనిఖీలు చేపట్టారు.

నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న 5 బాణసంచా షాపులను డి.ఎస్.పి సీజ్ చేశారు. మార్కెట్ స్ట్రీట్‌లోని కిరాణా షాపులతో పాటు, తయారీ కేంద్రాల్లో డి.ఎస్.పి ప్రసాద్, రూరల్ సీఐ ప్రశాంత్ కుమార్, టౌన్ సీఐ వీరబాబు, ఎస్సై శేఖర్ బాబు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఎవరైనా అనుమతులు లేకుండా టపాసులు తయారు చేసినా లేదా నిల్వ ఉంచినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.భద్రతా ప్రమాణాలు పాటించని వారిపై నిరంతరం నిఘా ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media