అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన డేటా ఆధారిత పాలన (Data-Driven Governance) పై సదస్సు జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, హెచ్‌ఓడీలు ప్రత్యక్షంగా, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.
సదస్సులో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు —
1)దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి ప్రజలకు సుపరిపాలన అందించాలని సూచించారు.
2)గ్రామ సచివాలయాలను విజన్ యూనిట్లుగా మార్చి సమర్థంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
3)ఇటీవల తుఫాన్ సమయంలో టెక్నాలజీ వినియోగంతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించగలిగామని అన్నారు.
4)క్వాంటం కంప్యూటర్‌ను జనవరి నుండి అమరావతిలో ప్రారంభించబోతున్నామని వెల్లడించారు.
5)సీఎఫ్ఎంఎస్ ద్వారా వనరుల సమర్థ వినియోగం జరుగుతోందని తెలిపారు.
6)గత ప్రభుత్వ విధ్వంసాన్ని సరిచేసి, 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని సూచించారు.
7) ప్రతి నియోజకవర్గానికి ఓసీనియర్ అధికారి నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి విజన్ ప్లాన్ అమలు చేస్తామని తెలిపారు.
“డేటా ఆధారిత పాలన ఇప్పుడు అత్యంత కీలకం. వేగవంతమైన నిర్ణయాలు, పారదర్శక సేవలే మంచి పాలనకు పునాది”

