అమరావతి రైతుల పోరాటానికి ఫలితం:హోం మంత్రి అనిత

April 2, 2026 4:54 PM

అమరావతి, ఏప్రిల్ 2 (BNS): అమరావతి రాజధానికి చట్టబద్ధత లభించడం పట్ల రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత హర్షం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, అమరావతి రైతులు 1,631 రోజుల పాటు దీర్ఘకాలిక పోరాటం చేసి ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్నారని తెలిపారు.

రైతుల సంకల్పం వల్లే ఈరోజు అమరావతికి న్యాయం జరిగిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అమరావతి రాజధానిని ఎవరూ మార్చలేరని స్పష్టం చేశారు.అమరావతి ప్రాంతానికి విశిష్ట చరిత్ర ఉందని, దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూ, అమరావతి అంశంపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media