అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు పార్లమెంటులో పూర్తి మెజారిటీతో ఆమోదం లభించడంతో ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

ఏపీ అసెంబ్లీ నుంచి పంపిన తీర్మానంపై లోక్సభలో సుదీర్ఘ చర్చ అనంతరం అమరావతి బిల్లును ఆమోదించారు. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని పార్టీల మద్దతును సాధించి బిల్లుకు చట్టబద్ధత కల్పించినందుకు ప్రధాని మోదీని మంత్రి లోకేష్ అభినందించారు.లోక్సభలో బిల్లు ఆమోదం పొందిన వెంటనే ఢిల్లీ చేరుకున్న మంత్రి లోకేష్, కూటమి ఎంపీలను కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం ప్రధాని మోదీని కలుసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు.ఇచ్చిన హామీకి కట్టుబడి కేంద్ర ప్రభుత్వం చూపిన నిబద్ధతను ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ప్రశంసించారు.
