Nara Lokesh మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గౌరవంగా అమరావతిలో ఏర్పాటు చేసిన ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’ విగ్రహం త్యాగానికి మానవరూపం అయిన Potti Sreeramulu గారి మహత్తును ప్రపంచానికి తెలియజేస్తుందని పేర్కొన్నారు.

అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా అమరావతిలో 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని N. Chandrababu Naidu ఆవిష్కరించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన చేసిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ఈ విగ్రహాన్ని నిర్మించారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగం వల్లే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, ఆయన త్యాగాన్ని భావితరాలకు గుర్తు చేసేలా ఈ విగ్రహం నిలుస్తుందని అన్నారు. అమరావతిలో సుమారు 6.8 ఎకరాల్లో పొట్టి శ్రీరాములు స్మృతి వనం నిర్మిస్తున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో Pawan Kalyan, Pemmasani Chandrasekhar తదితరులు పాల్గొన్నారు.
