Amaravati సమీపంలోని Velagapudi ఎన్9 జంక్షన్ వద్ద అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎల్ అండ్ టి స్టాక్ పాయింట్లో నిల్వ ఉంచిన పైపులకు మంటలు అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు, పొగలు ఎగసిపడ్డాయి.
అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అప్రమత్తమై చర్యలు చేపట్టారు. ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
