రాజధాని తూటా… కూటమికి చెక్-మేటా? క్యాపిటల్ గేమ్‌లో జగన్ సరికొత్త మైండ్ గేమ్.

July 2, 2026 2:27 PM
Jagan and Amaravati capital debate graphic.

AP: పాలిటిక్స్ అంటారుగానీ అవి పాలిట్రిక్స్ మాత్రమే. అక్కడ స్ట్రాటెజీలే చాలా డిఫరెంట్. ఏపీ పాలిటిక్స్ లో అయితే నెక్స్ట్ లెవెల్ మైండ్ గేమ్స్ నడుస్తున్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అప్పుడప్పుడు మీడియా ముందుకు వస్తున్నారు. వచ్చిన ప్రతిసారీ ఒక బాంబు పేల్చుతున్నారు. ఆ తర్వాత ఆయన సైలెంట్ అయినా … టాపిక్ మాత్రం తనచుట్టూమాత్రమే తిరగుతోంది. కరెక్ట్‌గా ఇక్కడే మెయిన్ పాయింట్ ఉంది… రీసెంట్‌గా జగన్ తెచ్చిన మావిగన్ (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు మెట్రోపాలిటన్ రీజియన్) నినాదం ఇప్పుడు కూటమి వర్సెస్ వైసీపీ( Amaravati vs Mavigan )మధ్య ఒక పెద్ద క్యాంపెయిన్ వార్‌గా మారింది. వైసీపీ అయితే ఈ మావిగన్ కాన్సెప్ట్‌ను తమ అల్టిమేట్ ఎజెండాగా ఫిక్స్ చేసుకుని, కూటమికి ఒక ఓపెన్ ఛాలెంజ్ విసిరింది. అమరావతి కావాలనుకునే వాళ్లు చంద్రబాబుకు ఓటేయండి, 110 కిలోమీటర్ల పరిధిలోని మావిగన్ డెవలప్‌మెంట్ నచ్చితే నాకు వేయండి… అంటూ జగన్ క్లియర్ కట్‌గా లైన్ గీసేశారు. పొలిటికల్ అనాలసిస్ ఎప్పుడూ వన్‌సైడెడ్‌గా ఉండదు కదా… ఈ గేమ్‌లో రెండు వైపులా మైండ్ బ్లోయింగ్ స్ట్రాటెజీలు ఉన్నాయి.


జగన్ విసిరిన మావిగన్ నినాదం కూటమిసర్కారుకి ఒక పొలిటికల్ టాస్క్ లాంటిదే. ఎందుకంటే మావిగన్ పరిధిని వ్యతిరేకిస్తే… ఆ 110 కిలోమీటర్ల పరిధిలోని ప్రజల డెవలప్‌మెంట్‌ను అడ్డుకుంటున్నారనే నరేటివ్‌ను వైసీపీ ఈజీగా పబ్లిక్‌లోకి తీసుకెళ్తుంది. చంద్రబాబుకు పట్టున్న రీజియన్‌లో ఇలాంటి నెగిటివిటీ రావడం రిస్కే. పైగా కేవలం 29 గ్రామాల ప్రయోజనాల కోసం, కొన్ని వేల కోట్ల అప్పుల భారాన్ని రాష్ట్రంపై మోపాలా?… అంటూ వైసీపీ వేస్తున్న ప్రశ్నలకి కూటమి నేతలు పర్ఫెక్ట్ కౌంటర్ ప్లాన్ రెడీ చేసుకోవాల్సి ఉంది. కేవలం వెటకారాలు, వ్యక్తిగత విమర్శలతో కాకుండా గ్రౌండ్ లెవెల్‌లో స్ట్రాంగ్ ఆప్షన్ చూపించాల్సిన టైమ్ వచ్చింది.


చంద్రబాబు సర్కారు కూడా తక్కువ తినలేదు. జగన్ ఈ సరికొత్త గేమ్ స్టార్ట్ చేశారంటేనే… గతంలో ఆయన చెప్పిన మూడు రాజధానుల ఫార్ములా వర్కవుట్ కాలేదని ఒప్పేసుకున్నట్టేనా? అనే కౌంటర్ అటాక్‌ని టిడిపి శ్రేణులు ఆల్రెడీ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నాయి. అమరావతి అనేది కేవలం 29 గ్రామాల ప్రయోజనం కాదు, అది ఒక గ్లోబల్ సిటీ ప్రాజెక్ట్ అని, దాని ద్వారానే రాష్ట్రానికి భారీగా ఆదాయం, యూత్‌కి జాబ్స్ వస్తాయని కూటమి గట్టిగా చెపుతోంది. మావిగన్ అనే పేరు వినడానికి కొత్తగా ఉన్నా, అందులో ఉన్న ఏరియాలన్నీ ఆల్రెడీ CRDA పరిధిలో ఉన్నవే కదా, ఇందులో కొత్తగా జగన్ తెచ్చిన ప్లాన్ ఏముంది? అనేది కూటమి వర్షన్.


ఒకవైపు అమరావతిలో సెకండ్ ఫేజ్ కింద భూములు ఇవ్వడానికి కొంతమంది రైతులు ఒప్పుకోకపోవడం, వాళ్లు జగన్‌ను కలవడం వైసీపీకి ప్లస్ పాయింట్ లాగా కనిపిస్తోంది. అదే టైంలో అమరావతిని వరల్డ్ క్లాస్ సిటీగా చూపిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రాబట్టడంలో చంద్రబాబు సక్సెస్ అయితే… అది కూటమికి అల్ట్రా-ప్రో-మాక్స్ బూస్ట్ అవుతుంది. రాజకీయం అంటేనే ఒక చెస్ గేమ్. ఇక్కడ ఏ మూవ్ ఎప్పుడు రివర్స్ అవుతుందో చెప్పలేం. జగన్ మావిగన్ పేరుతో ఒక పవర్ ఫుల్ పావుని ముందుకు కదిపితే… చంద్రబాబు అండ్ టీమ్ అమరావతి గ్లోబల్ బ్రాండ్ తో దాన్ని ఎలా బ్లాక్ చేయబోతున్నారు? అనేది చూడాలి. ఎజెండాలు సెట్ చేయడం జగన్ స్టైల్ అయితే… ఆ ఎజెండాలనే రివర్స్ తిప్పడం చంద్రబాబు సీనియారిటీ. లెట్స్ సీ… ఈ క్యాపిటల్ వార్‌లో విన్నర్ ఎవరో.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media