Ambani :₹165 కోట్ల విరాళం ఇచ్చిన ముఖేశ్ అంబానీ

November 10, 2025 3:09 PM

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆదివారం ఆయన ఒకేరోజులో మూడు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలను సందర్శించి రూ.165 కోట్లకు పైగా విరాళాలు ప్రకటించారు.

తిరుమలలో అన్నప్రసాదం ట్రస్టు కోసం ₹100 కోట్లు విరాళంగా ప్రకటించి, ప్రతి రోజు రెండు లక్షల మందికి అన్నదానం అందించే ఆధునిక వంటశాల నిర్మించనున్నట్లు తెలిపారు.రాజస్థాన్ నాథ్‌ద్వారా ఆలయంలో యాత్రికుల సదుపాయాల కోసం ₹50 కోట్ల విరాళం, తొలి విడతగా ₹15 కోట్ల చెక్కు అందజేశారు.కేరళ గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి ₹15 కోట్ల తొలి విడత విరాళం ఇచ్చారు.

మూడు రాష్ట్రాల్లో ఒకేరోజు సేవా కార్యక్రమాలకు విరాళాలు ప్రకటించిన అంబానీ చర్య సామాజిక వర్గాల్లో విస్తృతంగా ప్రశంసలు అందుకుంటోంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media