భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా, ప్రభుత్వ విప్ శ్రీ గణబాబు గారు గోపాలపట్నం నియోజకవర్గంలోని 91వ వార్డు, లక్ష్మీనగర్, బాజీ జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు అందించిన భారత రాజ్యాంగం దేశ పరిపాలనా విధానానికి ఎంతో ఉపయోగకరంగా ఉందని గణబాబు గారు కొనియాడారు. దళితులు తమ హక్కులను సాధించుకోవడంలో భారత రాజ్యాంగం కీలక పాత్ర పోషించిందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో వివిధ దళిత సంఘాల నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
