అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో డాక్టర్ B. R. Ambedkar 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ Tuhin Sinha ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్. మోహన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదనపు ఎస్పీ మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి మాత్రమే కాకుండా సమాజంలోని అన్ని వర్గాలకు ఆదర్శమని పేర్కొన్నారు.సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి దేశానికి మార్గదర్శకమని, ఆయన చూపిన బాటలో నడుస్తూ ప్రతి ఒక్కరూ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
