అంబేద్కర్ జయంతి వేడుకల్లో అయ్యన్నపాత్రుడు, అనిత

April 14, 2026 4:31 PM

డాక్టర్ B.R అంబేద్కర్ జయంతి సందర్భంగా అనకాపల్లి జిల్లాలో నిర్వహించిన కార్యక్రమాల్లో స్పీకర్ Chintakayala Ayyannapatrudu, హోం మంత్రి Vangalapudi Anitha పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

నాతవరం, గొలుగొండ, కేడీ పేట ప్రాంతాల్లో నూతన పోలీస్ స్టేషన్ భవనాలను ప్రారంభించారు. అలాగే పీఎం సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన కింద ఎస్సీ, ఎస్టీ సోలరైజేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, హోం మంత్రిగా అనిత సమర్థతను నిరూపించారని, అసెంబ్లీలో ఆమె ప్రసంగాలు స్పష్టంగా ఉంటాయని కొనియాడారు.హోం మంత్రి అనిత మాట్లాడుతూ, అయ్యన్నపాత్రుడు తన రాజకీయ గురువని తెలిపారు. రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని, పీడీ యాక్ట్, ఎన్‌డీపీఎస్ చట్టాలను కఠినంగా అమలు చేస్తామని హెచ్చరించారు. నర్సీపట్నం ప్రాంతంలో వచ్చే ఆరు నెలల్లో గంజాయి, రౌడీయిజాన్ని పూర్తిగా అణచివేస్తామని హామీ ఇచ్చారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media