రాజ్యాంగ నిర్మాత భారతరత్న DR.B.R.AMBEDKHAR గారి వర్ధంతి సందర్భంగా గురజాల శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు పిడుగురాళ్లలోని టీడీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రాజ్యాంగం గొప్పదనం: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి రూపకల్పన చేసి, గ్రామ స్థాయి నుండి పార్లమెంట్ వరకు వ్యవస్థలను ఏర్పాటు చేసి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్లను రాజ్యాంగంలో పొందుపరిచిన ఘనత అంబేద్కర్ గారిది అని యరపతినేని కొనియాడారు.
2019-2024 మధ్యకాలంలో రాష్ట్రంలో అమలు చేసింది అంబేద్కర్ రాజ్యాంగం కాదని, జగన్ వాళ్ల తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశారని యరపతినేని ఘాటు విమర్శలు చేశారు.
కడపలోని ఒంటిమిట్టలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే, అక్కడి ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో వైసీపీకి సరైన బుద్ధి చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు.
