అమెరికా దాడిలో విశాఖ యువకుడు మృతి

June 11, 2026 9:57 PM
suresh-patnala-attacked-by-america

గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో అమెరికా సైనిక బలగాలు జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంకు చెందిన వ్యక్తి కూడా ఉన్నాడు. జూన్ 10న ‘ఎంటీ సెటెబెల్లో’ అనే చమురు ట్యాంకర్‌పై అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్‌) దాడి చేసింది. ఇరాన్‌పై విధించిన ఆంక్షలను ఉల్లంఘిస్తూ చమురు రవాణా చేస్తున్నారని, తమ ఆదేశాలను పాటించకపోవడంతోనే నౌకలోని ఇంజిన్ రూమ్‌ను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడినట్లు అమెరికా ప్రకటించింది.

ఈ దుర్ఘటనలో విశాఖకు చెందిన చీఫ్ ఇంజినీర్ పట్నాల సురేష్ (44), డెక్ క్యాడెట్ ఆదిత్య శర్మ, ఫిట్టర్ శివానంద్ చౌరాసియా మరణించారు. సురేష్‌కు భార్య భార్గవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. గత ఐదు నెలలుగా విధుల్లో ఉన్న సురేశ్ త్వరలోనే ఇంటికి రావాల్సి ఉండగా ఇంతలో ఈ విషాదం చోటు చేసుకుంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media